Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeకవితఎన్నారైల అమ్మ

ఎన్నారైల అమ్మ

- Advertisement -

కాలాన్ని దూషించి ఏం లాభం
ప్రాణాలకు ఫణమైముత్యమంటి
రెండు ప్రాణప్రదాలకు అమ్మనై
పరిణామచక్రంలో ఇరుసునై
తన ఇంటికో జీవధారనై
పహారా యోధుడి ఎదురుచూపునై
తన కంటిదీపమై
తన కలల వెచ్చని కౌగిట బందీనై
ఇంటి నోటికి ముద్దలందించి అతను
ప్రేమ పాశంలో ముంచెత్తినతను
నాన్న పాత్రలో ఒదిగి మురిసినతను
నిశ్శబ్దపు చీకటి పరదాల్లో అస్తమించి అతనే
ఒడిదుడుకుల ఒంటరి ప్రయాణంలో అమ్మ
సమాజపు గేలి చూపులకు చిరునవ్వుల స్థిమితత్వపు తొడుగై
కాకుల్లా పొడిచే సంఘానికి కలికితురాయియై
కనురెప్పల మాటున మంచి ముత్యాలను చెక్కితే
ఒంటరి అమ్మ – వలస బిడ్డలు అందమైన బహుమతి
ఇప్పుడు అమావాస్య చీకట్లలో మౌన మునిలా అమ్మ
నిశ్శబ్దానికి నిశ్శబ్దాన్ని బదులిస్తూ
మలి సంధ్యలో మెలిపెట్టే గుండెను అదుముకుంటూ
వలస పక్షుల వలస సీజన్‌ కోసం ఎదురు చూస్తూ
ఆ వచ్చే సందడిని స్వప్నిస్తూ గడపకే కళ్ళైన యోగిని అమ్మ
అజ్ఞాతవాసం అమ్మకేనా
దిగులు గూటిని విడిచే పక్షి
అమ్మ ఎప్పుడవుతుందో
నాన్న ఉన్నప్పుడు ఎదురుచూపైన అమ్మ
వలస పిట్టలకూ ఎదురుచూపైన అమ్మ
కాల్‌ ప్రవాహాల గతిలో ఈదులాడే అమ్మకు
ఎదురు చూపులే బహుమతి
అశాంతుల బాహాబాహీలో దిగులు చూపుల ఏకాకి ఎన్నారైల అమ్మకు వేల కోట్ల మౌనాలే బంగారు బహుమతులు
– మేరెడ్డి రేఖ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad