Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకేరళ భేష్‌

కేరళ భేష్‌

- Advertisement -

ఐదుకు తగ్గిన శిశుమరణాల రేటు
భారతదేశ సగటు కంటే ఐదు రెట్లు తక్కువ
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మంచి ప్రదర్శన
ఎస్‌ఆర్‌ఎస్‌ స్టాటిస్టికల్‌ రిపోర్ట్‌
తిరువనంతపురం :
దేశంలో శిశుమరణాల రేటులో కేరళ మ రోసారి చక్కటి ప్రదర్శనను కనబర్చింది. రాష్ట్రంలో శిశుమరణాల రేటు ఆల్‌టైమ్‌ రికార్డు కనిష్ట స్థాయికి తగ్గింది. ఇక్కడ ప్రతి వెయ్యి జననాలకు కేవలం ఐదుగురు శిశువులే మృతి చెందుతున్నారు. దీంతో శిశుమరణాల రేటు 5కి తగ్గింది. ఇది జాతీయ సగటు 25 కంటే ఐదురెట్లు తక్కువే. అంతేకాదు.. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో శిశుమరణాల రేటులో సింగిల్‌ డిజిట్‌(5) నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది.తాజా నమూనా నమోదు సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌) స్టాటిస్టికల్‌ నివేదిక ఈ విషయాలను తెలిపింది. 2023 సంవత్సరపు రికార్డులనే ఈ సర్వే పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2022 నాటి గణాంకాల ప్రకారం అమెరికాలోనే శిశు మరణాల రేటు 5.6గా ఉంది. దీంతో భారత్‌లో ఒక్క కేరళలోనే శిశుమరణాల రేటు 5గా ఉండడం ఆ రాష్ట్రం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. కాగా, కేరళలో 2018లో శిశు మరణాల రేటు 7, 2019లో 6గా ఉంది. ఈ విధంగా ప్రతి ఏడాదీ శిశుమరణాల సంఖ్యను తగ్గిస్తూ కేరళ చక్కటి ప్రదర్శనను కనబరుస్తున్నది.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు : కేరళ మంత్రి వీణా జార్జ్‌
కేరళలో శిశుమరణాల రేటు యూఎస్‌ కంటే కూడా తక్కువగా ఉన్నదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తాజా నివేదికను ఉటంకిస్తూ చెప్పారు. శిశుమరణాల రేటు విషయంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య విస్తృత అంతరం ఉన్నదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 28గా ఉంటే.. పట్టణాల్లో 19గా ఉన్నదని ఆమె చెప్పారు. కేరళ విషయంలో మాత్రం పట్టణ, గ్రామీణ తేడాలేవీ లేవని వివరించారు. పట్టణం, గ్రామీణ అనే విషయంతో సంబంధం లేకుండా కేరళ ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణ సేవలను పొందుతున్నార్నన విషయాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని మంత్రి చెప్పారు.

హెల్త్‌ సెక్టార్‌లో నిరంతర కృషితో చక్కటి ఫలితాలు
కొన్నేండ్లుగా ఆరోగ్య రంగంలో చేస్తున్న నిరంతర ప్రయత్నాల కారణంగానే కేరళలో శిశుమరణాల రేటు తగ్గిందని గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక, గణాంకాల విభాగం సమాచారం ప్రకారం.. కేరళలో శిశుమరణాల రేటు 2017లో 7.42గా ఉండేది. 2012లో ఇది 8.2కి చేరింది. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో శిశుమరణాలు తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోనూ చాలా వరకు శిశువుల జననాలు సంస్థాగత డెలివరీల(ఆస్పత్రులు, క్లీనిక్‌లు వంటి మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ల వద్ద శిశువుల జననాలు) ద్వారానే జరుగుతున్నాయని రాష్ట్ర గణాంకాలు చెప్తున్నాయి. ఇవి 2023లో గ్రామీణ ప్రాంతాల్లో 96.16 శాతంగా, పట్టణాల్లో 99.88 శాతంగా ఉన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad