- Advertisement -
సందర్శకులతో కిక్కిరిసిన నాగులమ్మ ఆలయం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపచాయితీ పరిదిలోగల కోయకుంట్ల నాగులమ్మ ఆలయంలో మంగళవారం నాగపంచమి వేడుకలు మంగళవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల మహిళలు నియమనిష్ఠలతో ప్రత్యేక పూజలు చేశారు.సందర్శకులతో ఆలయం కిక్కిరిసింది.అమ్మవారికి పసుపు,కుంకుమ,కుడుక తదితర కానుకలు సమర్పించారు.పుట్టలో పాలు, గుడ్డు,బెల్లం పానకం సమర్పించారు.నమ్మినవారికి కొంగు బంగారం మవునని ప్రగాఢ నమ్మకం.ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని ఆలయ పూజారులు ప్రత్యేకంగా పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -