- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఉద్యోగ విరమణ చేశారు. సోమవారం నాడిక్కడి రైల్‌నిలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఆయన్ని ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. 2022లో ఆయన ఎస్సీఆర్ జనరల్ మేనేజర్‌గా బాధ్యత లు స్వీకరించారు. రిటైర్‌మెంట్ ఫంక్షన్‌లో ఎస్సీఆర్ అదనపు జనరల్ మేనేజ ర్ నీరజ్ అగర్‌వాల్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జే వినయన్ తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ జైన్ రైల్వేల అభివృద్ధికి తీసుకున్న చర్యల్ని కొనియాడారు. అంతకుముందు మౌలాలీలోని ఆర్పీఎఫ్ శిక్షణాకేంద్రంలో రైల్వే రక్షణదళం గౌరవవందనాన్ని ఆయన స్వీకరించారు.
- Advertisement -