Thursday, November 27, 2025
E-PAPER
HomeNewsనామినేషన్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి!

నామినేషన్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి!

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు:

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి. నామినేషన్ ఫారమ్ లో తప్పులు జరుగకుండా చూసుకోవాలి. ఫారమ్ లోని అన్ని కాలమ్ లను పూరించాలి. తెలియని వివరాలు ఉంటే వర్తించదు (నాట్ అప్లి కేబుల్ / నిల్ / తెలియదు) అని రాయాలి.

ఖాళీగా వదిలిపెడితే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పేరు, చిరునామా, వయస్సు, రిజర్వేషన్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని సరిగా రాయాలి. నామినేషన్ పత్రంతో పాటు సమర్పించే విట్ లో పూర్తి వివరాలు నింపకపోవడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం చేయరాదు. అఫిడవిట్ ను నోటరీ చేయించకపోవడం లేదా సరైన ఫార్మాట్లో సమర్పించకపోవడంతో ఇబ్బందులు తప్పవు.

ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు మొదలైన వివరాలు స్పష్టంగా పేర్కొనాలి.ఏదైనా రిజర్వ్ చేయబడిన (ఎస్సీ, ఎస్టీ, మహిళ) స్థానం కోసం పోటీచేసే అభ్యర్థులు కులం/కేటగిరీ ధ్రువీకరణ పత్రాలను సరియైన సమయంలో, సరియైన పద్ధతిలో సమర్పించాలి.సర్పంచ్ అభ్యర్థికి ప్రతిపాదకుడు అదే గ్రామ పంచాయతీలో ఓటరు అయి ఉండాలి. ప్రతిపాదకుడుగా ఉన్న వ్యక్తి పేరు, ఓటరు జాబితాలో ఉన్న వివరాలతో సరిపోవాలి. అఫిడవిట్ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ను (పూచీకత్తు మొత్తం) నిర్ణీత మొత్తంలో, నిర్ణీత విధానంలో సమర్పించాలి.నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి నోటిఫికేషన్లో పేర్కొన్న చివరి తేదీ సమయం లోపల అందజేయాలి. నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా ఉండా లంటే, అభ్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్లో, ఫారమ్ లో ఇచ్చిన సూచనలను చాలా జాగ్రత్తగా చదివి, అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవడం ముఖ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -