షార్ట్ ఫిల్మ్స్ స్థాయి నుంచి హీరోగా తనకంటూ ఓ స్థాయిని సొంతం చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. తనలా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో రాణించాలని ఆశపడే ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులకు అండగా నిలుస్తానని ‘దిల్ రూబా’ సినిమా ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చెప్పారు.
చెప్పినట్లే కొత్త వాళ్లతో తన సొంత బ్యానర్ పై మూవీ ప్రొడ్యూస్ చేయటానికి రంగం సిద్ధం చేశారు. తన గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మిస్తున్నారు. తన మూవీస్‌కు ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసిన మునికి దర్శకుడిగా అవకాశం కల్పిస్తున్నారు. నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఎమోషనల్ డ్రామాగా మంచి కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది.
కిరణ్ అబ్బవరం స్పందిస్తూ, ‘ప్రతి ప్రయాణం ఒక కలతో మొదలవుతుంది. ఆ కల నిజమవుతుందో లేదో ప్రయాణం మొదలు పెట్టినప్పుడు తెలియదు. ఏడేళ్ల కింద ఒక పట్టుదలతో ఓ డ్రీమ్‌తో సినిమా పరిశ్రమలో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ఆదరణతో గుర్తింపు సంపాదించు కున్నాను. నాలాగే ఒక కలతో సినిమా పరిశ్రమకు వచ్చే యంగ్ టాలెంట్‌కు మా కేఏ ప్రొడక్షన్స్ ద్వారా అవకాశాలు అందించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ నెల 10న మా తొలి సినిమాని అనౌన్స్ చేస్తున్నాం’ అని అన్నారు.
నూతన ప్రతిభకు అండగా..
- Advertisement -
- Advertisement -