Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపహల్గాంలో ఉగ్రదాడి.. స్పందించిన మోడీ

పహల్గాంలో ఉగ్రదాడి.. స్పందించిన మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ దాడిలో దాదాపు 28 మంది మరణించినట్టు తెలుస్తోంది. పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోడీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. దాడి వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి దుష్ట అజెండా ఎప్పటికీ విజయవంతం కాదని అన్నారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం అచంచలమైనదని, ఇలాంటి దాడుల వల్ల అది మరింత బలపడుతుందని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img