నవతెలంగాణ-హైదరాబాద్: మూడో టీ20లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు కైవసం చేసుకున్నాడు. ధర్మశాల వేదికగా జరగుతున్న మూడో టీ20 మ్యాచ్లో 100 వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ట్రిస్టన్ స్టబ్స్ ను ఆవుట్ చేయడంతో హార్దిక్ పాండ్యా ఈ ఫిట్‌ను సాధించాడు.
మరోవైపు మూడో టీ20 మ్యాచ్‌లో బౌలర్ల హవా నడుస్తోంది. 44 పరుగులకే సఫారీ టీం 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు టాఫార్డర్ రీజా హెడ్రిక్స్, క్వింటన్ డికాక్ (WK), డేవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్ సింగిల్ పరుగులకే ఔట్ అయ్యారు. హర్షిత్ రాణా 2 వికెట్లు, హర్షదీప్, హార్థిక పాండ్యా,శివం దూబె తలో వికెట్ తీశారు. పది ఓవర్లు ముగిసే సరికి ఎడెన్ మార్క్రమ్(27), డోనోవన్ ఫెరెయిరా క్రీజులో ఉన్నారు.



