నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కటాఫ్ డేట్‌ను కేంద్రం పొడిగించింది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి మతపరమైన హింస నుంచి తప్పించుకోవడానికి 2024 డిసెంబర్ 31లోపు భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మతాలకు చెందినవారు పాస్‌పోర్ట్, ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలో ఉండటానికి అనుమతిస్తామని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31న లేదా అంతకుముందు భారత్‌కు వలస వచ్చిన ముస్లింమేతర మైనార్టీలకు భారత పౌరసత్వం మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు సీఏఏ కటాఫ్ తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అలాంటి విదేశీ పౌరులకు భారత్‌లోకి నో ఎంట్రీ కేంద్రం కీలక నిర్ణయం
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దోషులుగా తేలిన వారిని భారత్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు గూఢచర్యం, లైంగికదాడి, హత్య, ఉగ్రవాద చట్టాలు, పిల్లల అక్రమ రవాణా, నిషేధిత సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారిని దేశంలోకి రానివ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హౌం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ 2025 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీని ప్రకారం ప్రతి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు ఇందుకోసం చర్యలు తీసుకోవాలని సూచించింది. వీరిని దేశం నుంచి బహిష్కరించే వరకూ భారత్‌లో తిరగకుండా ప్రత్యేక తనిఖీ కేంద్రాలు, నిర్బంధ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హౌల్డర్ కోసం రిజిస్ట్రేషన్‌తో సహా ఏదైనా వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి విదేశీ పౌరుడు తన బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం పేర్కొంది.
సీఏఏ కటాఫ్ డేట్ పొడిగింపు
- Advertisement -
- Advertisement -