Thursday, January 22, 2026
E-PAPER
Homeజాతీయంకలుషిత నీటితో 10 మంది మృతి

కలుషిత నీటితో 10 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుగాంచిన ఇండోర్‌లో నీటి కాలుష్యం కారణంగా 10 మంది మరణించడం కలకలం రేపింది. మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసే మంచినీటి పైప్‌లైన్‌లో మురుగునీరు కలవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 25నే కుళాయిల నుంచి దుర్వాసన వస్తోందని భగీరథ్పుర వాసులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. మరణించిన వారిలో ఆరు నెలల శిశువు కూడా ఉంది. ప్రస్తుతం 2,000 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -