Tuesday, June 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్100 రోజుల యాక్షన్ ప్లాన్..

100 రోజుల యాక్షన్ ప్లాన్..

- Advertisement -

నవతెలంగాణ  – భువనగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా భువనగిరి పురపాలక సంఘ కార్యాలయం యందు అధికారులు మరియు సిబ్బందితో  కమీషనర్  జి. రామలింగం  సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీయుత కమిషనర్ గారు మాట్లాడుతూ ఇట్టి 100 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం 51 యాక్టివిటీస్ ఉన్నారన్నారు. ఈనెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆక్టివిటీస్ నిర్వహించబడతాయనానారు. అందులో భాగంగా ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ పరణమైన పనులు, పెద్ద మురికి కాలువలు, నాళాలు, సోషల్ మీడియా క్యాంపెయిన్, పడి పడి చెత్తలపై ఇంటింటికి అవగాహన సమావేశాల, వాల్ పెయింటింగ్స్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, దోమల నివారణ, పరిశుద్ధ కార్మికులకు హెల్త్ క్యాంప్స్, ర్యాలీలు నిర్వహింస్తామన్నారు. స్వచ్ఛత కాంపిటీషన్స్, అవార్డులు, క్విజ్ కాంపిటీషన్స్, పెయింటింగ్స్, రంగోలి కాంపిటీషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, భువన్ సర్వే, ట్రేడ్ లైసెన్స్ గుర్తించుట, ఇంటి నల్ల కనెక్షన్లను ఆన్లైన్ చేయుట, మహిళా సంఘాల ప్రోడక్ట్ మేలా, స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్, వీధివిక్రయదారుల సంఘాలు ఏర్పాటు చేయుట, మహిళా సంఘాల వారికి బ్యాంకు లింకేజీ ఇచ్చుట, స్ట్రీట్ వెండింగ్ జోన్లను సమీక్షించుట, కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేయుట, ఓవర్ హెడ్ టాంక్స్ శుభ్రం చేయుట, లోతట్టు ప్రాంతాలు  పూడ్చుట, ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం, శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించడం, మురికి కాలువ మరియు నాళాలపై మెష్ ఏర్పాటు చేయుట, జంక్షన్స్ అభివృద్ధి చేయుట, అనిమల్ బర్త్ కంట్రోల్ బర్త్ పై క్యాంపెయిన్ నిర్వహించటం, ఇంకుడు గుంతల నిర్మాణం చేయుట, చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి చేయుట, వన మహోత్సవం నిర్వహించుట, ప్రొఫైలింగ్ ఆఫ్ వేస్ట్ పిక్కర్స్, క్లోరినేషన్ టెస్ట్లు నిర్వహించడం మొదలగు పనులను చేస్తామన్నారు.  పట్టణంలో అమలు చేయుటకు గాను వాటి అధికారులకు మరియు రిసోర్స్ పర్సన్ లకు  కమిషనర్  దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఇట్టి వంద రోజులు ప్రణాళికలలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో అమలు చేయాలని మరియు ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు ప్రజలందరూ  ఇందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -