– పట్టణ ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట : పురపాలక శాఖ ఆదేశానుసారం సోమవారం నుండి ప్రారంభమైన మున్సిపాలిటీల్లో వందరోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట పట్టణ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించినట్లు పట్టణ ప్రణాళిక అధికారి వలసాల శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. ఈ నేపధ్యంలో నిర్వహించే ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ వీదుల్లో ప్రదర్శన నిర్వహించి పారిశుధ్యం,తాగునీరు, వీధి లైట్ల నిర్వహణతో పాటు వర్షాకాలంలో వ్యాపించే వ్యాదుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రణాళికపై పౌర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
అశ్వారావుపేట అభివృద్ధికి వందరోజులు ప్రణాళిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES