Sunday, December 21, 2025
E-PAPER
Homeసినిమా100%వినోదం

100%వినోదం

- Advertisement -

హీరో రవితేజ, కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ,’ఆద్యంతం వినోదంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మంచి ఫన్‌, సాంగ్స్‌ అన్నీ కలిపి 100% ఆకట్టుకునేలా ఉంటాయి. రవితేజతో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. మన జీవితం తెరపై చూసుకుంటున్నట్టుగానే ఉంటుంది. రవితేజ మార్క్‌ ఫన్‌ మిస్‌ అవ్వకుండా నా ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమాని చాలా ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించార’ అని తెలిపారు.

‘జనవరి 13న మా సినిమాని రిలీజ్‌ చేస్తున్నాం. మాతోపాటు వస్తున్న సినిమాలు కూడా బాగా ఆడి, కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి. ఇండిస్టీ బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు బాగా ఆడతాయనే నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నాం’ అని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి చెప్పారు. హీరోయిన్‌ డింపుల్‌ మాట్లాడుతూ,’కిషోర్‌ తిరుమల చాలా సెన్సిబుల్‌ డైరెక్టర్‌. ఇందులో నా క్యారెక్టర్‌ పేరు బాలామణి. ఇందులో కొత్త డింపుల్‌ని చూస్తారు. ఇది భోగి రోజున రిలీజ్‌ అవుతుంది. ఇది నా ఫస్ట్‌ సంక్రాంతి సినిమా. అందుకే ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌’ అని తెలిపారు. ‘మోడరన్‌ రిలేషన్‌షిప్‌ గురించి చాలా హ్యూమరస్‌గా, సెన్సిబుల్‌గా చెబుతున్నాం. ఇందులో మానస శెట్టి పాత్రలో మోడరన్‌ కాన్ఫిడెంట్‌ బోల్డ్‌ క్యారెక్టర్‌లో అలరిస్తాను. ఈ సినిమా ఓ సంక్రాంతి పండగలా ఉంటుంది’ అని మరో కథానాయిక ఆషికారంగనాథ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -