Friday, January 9, 2026
E-PAPER
Homeసినిమా100% వినోదం

100% వినోదం

- Advertisement -

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షిచౌదరి జంటగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా, శ్రీకర స్టూడియోస్‌ సమర్పించింది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈచిత్రం ఈనెల 14న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈ సంక్రాంతికి మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా సినిమాని రూపొందించాం. మొదటి నుంచి చివరివరకు నవ్వుతూనే ఉంటారు.

అదే సమయంలో అందమైన భావోద్వేగాలు కూడా ఉంటాయి. దర్శకుడు మారి మొదటి సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించారు’ అని తెలిపారు. ‘ఇందులో నేను చారులత పాత్ర పోషించాను. ఇది నా మనసుకు దగ్గరైన పాత్ర. ఇది పక్కా పైసా వసూల్‌ ఫిల్మ్‌’ అని కథనాయిక మీనాక్ష చౌదరి చెప్పారు. దర్శకుడు మారి మాట్లాడుతూ,’ట్రైలర్‌లాగానే సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. మొదటి నుంచి చివరివరకు ఫుల్‌ ఎంటర్టైన్మెంట్‌ ఉంటుంది. సంక్రాంతికి తగ్గ ఓ మంచి వినోదభరిత చిత్రమిది’ అని అన్నారు. ‘ట్రైలర్‌లో ఎలాగైతే పంచ్‌లు పేలాయో.. సినిమా అంతా అలాగే పంచ్‌లు పేలుతాయి. పండగ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి’అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -