నవతెలంగాణ-హైదరాబాద్: మంగళవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘సబ్కా బీమా సబ్కి రక్ష’ పేరుతో బీమా చట్టాలు (సవరణ) బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. పాలసీదారుల రక్షణను బలోపేతం చేయడం, బీమా వ్యాప్తిని మరింతగా పెంచడం, దేశంలో బీమా రంగం వృద్ధిని వేగవంతం చేయడమే ఈ బిల్లు లక్ష్యంగా ఉంది.
కాగా, ఈ బిల్లు 1938 బీమా చట్టం, 1956 జీవిత బీమా కార్పొరేషన్ చట్టం, 1999 భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ) చట్టం వంటి కీలక చట్టాలను సవరిస్తూ తెచ్చిన బిల్లు ఇది. 2047 నాటికి అందరికీ బీమా సౌకర్యం కల్పించడం, అలాగే ఈ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా కేంద్రం ఈ బీమా చట్టాలకు సవరణ బిల్లు తెచ్చింది. మరో ముఖ్యమైనదేమిటంటే.. బీమా రంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం తలుపులు తెరిచింది. అంతకుముందు ఈ రంగంలో ఎఫ్‌డిఐ 74 శాతంగా ఉంటే.. ఈ సవరణ బిల్లుతో ఎఫ్‌డిఐలు వందశాతం అనుమతి పొందినట్లైంది.
బీమా రంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
- Advertisement -
- Advertisement -



