Sunday, November 9, 2025
E-PAPER
Homeకరీంనగర్108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ..

108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ..

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు కొత్తగా వచ్చిన 108 ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్, సోమవారం శంకరపట్నం మండలం  కేశవపట్నం 108 అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, మందులు, మరియు వాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మేనేజర్ జనార్ధన్ మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. ప్రమాదంలో ఉన్న బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కేశవపట్నం 108 అంబులెన్స్ సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ తనిఖీలో 108 సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి,మరియు పైలట్ ఖాజా ఖలీలుల్లా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -