Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్108 సిబ్బంది పనితీరుపై తనిఖీలు..

108 సిబ్బంది పనితీరుపై తనిఖీలు..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి
మండల108 సిబ్బంది పనితీరుపై ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ రాష్ట్ర నాణ్యత విభాగం అధికారి కిషోర్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్, జిల్లా మేనేజర్ హరి రామ కృష్ణతో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని బెజ్జంకి, కోహెడ మండలాల108 వావానాలు, సిబ్బంది, రికార్డులను సంస్థ అధికారులు తనిఖీ చేశారు. సిబ్బంది అందించిన అత్యవసర సేవలను ప్రశంసించి సమస్యలను తెలుసుకున్నారు. మరింత విస్తృతంగా క్షతగాత్రులకు సేవలందించాలని సంస్థ అధికారులు సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -