నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీపాలిత రాష్ట్రం అసోంలో 108 ఉద్యోగులు రోడ్డెక్కారు. అర్ధనగ్న ప్రదర్శనలతో ప్లకార్డులు చేతబూని అంబులెన్స్ డ్రైవర్లు, సాంకేతిక నిపుణులతో కూడిన ఆల్ అస్సాం 108 మృత్యుంజయ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఉద్యోగ భద్రతతో ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రోజుకు 12 గంటల పని భారంతో అలసిపోతున్నామని, కానీ 10 గంటల పని చేస్తున్నట్లు రికార్డులోకి నమోదు జీతం తక్కువగా ఇస్తున్నారని 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు ప్రాంజల్ శర్మ అన్నారు. ఎలాంటి సెలవులు లేకుండా అత్యవసర సేవలు అందిస్తున్నామని తెలియాజేశారు.
“మేము రోజుకు 12 గంటలు పని చేస్తాము కానీ 10 గంటలు మాత్రమే జీతం పొందుతాము. సెలవు దినాల్లో లేదా అత్యవసర సమయాల్లో కూడా మేము విధుల్లో ఉంటాము. మాకు అందించిన కొద్దిపాటి వేతన అంచనాను మేము తిరస్కరించాము’ అని ఆందోళనకారులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.



