Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచెంచు మహిళ మృతదేహాన్ని అడవిలో వదిలివెళ్ళిన 108 సిబ్బంది

చెంచు మహిళ మృతదేహాన్ని అడవిలో వదిలివెళ్ళిన 108 సిబ్బంది

- Advertisement -

శవం దగ్గరనే తెల్లవారులు కుటుంబ సభ్యులు కాపలా..
కనికరించని ఐటిడిఏ అధికారులు..
నవతెలంగాణ – అచ్చంపేట
మృతి చెందిన చెంచు మహిళా మృతదేహాన్ని గ్రామానికి చేర్చకుండా 108 సిబ్బంది అడవి మధ్యలో వదిలి వెళ్లారు. తెల్లవార్లు కుటుంబ సభ్యులు శవం దగ్గరనే కాపలా ఉన్నారు. ఈ అమానివీయ సంఘటన నల్లమలలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఈర్లపెంటకు చెందిన చెంచు మహిళ గురువమ్మ (29 ) గత పది రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్ళింది.

అయితే మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట నుండి మహబూబ్ నగర్ తరలించారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యంతో గురువమ్మ నిన్న సాయంత్రం మరణించింది. దీంతో మహిళ మృతదేహాన్ని ఈర్లపెంటకు చేర్చడానికి 108 అంబులెన్స్ లో తీసుకొచ్చారు. సాయంత్రం చీకటి పడింది అంటూ 108 సిబ్బంది రాత్రి సమయంలో మేము నిద్రలో ఉండగా మృతదేహాన్ని ఇలా అడవిలో వదిలి వెళ్ళడం ఏంటని చెంచు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ అధికారులకు ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. తెలిసిన వారి సహకారంతో మహిళ మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లారు. ఐటీడీఏ అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తించారని చెంచులు మండిపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -