Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమూడో విడతలో 11 గ్రామాలు సర్పంచ్‌ పోటీకి దూరం

మూడో విడతలో 11 గ్రామాలు సర్పంచ్‌ పోటీకి దూరం

- Advertisement -

నామినేషన్ల దాఖలుకు ముందుకు రాని అభ్యర్థులు
అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో ఆరు వంద వార్డులకు సైతం నామినేషన్లు నిల్‌
సర్పంచ్‌ ఎన్నికల బరిలో 27,277 మంది అభ్యర్థులు
వార్డుల్లో 89,603 నామినేషన్లు
నేడు అప్పీళ్లు, రేపు పరిశీలన
9న నామినేషన్ల ఉపసంహరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మూడో దశలో ఎన్నికలు జరుగుతున్న 4,158 పంచాయతీల్లో 11 గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 6, కొమురంభీం ఆసీఫాబాద్‌ జిల్లాలో 2, అదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒక్కొ గ్రామంలో పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. అలాగే 36,442 వార్డులకు గాను 100 వార్డులో కూడా ఎవరూ పోటీకి ఆసక్తి చూపక పోవడంతో ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదని ఈసీ తెలిపింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 44, ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలో12, ఖమ్మంలో9, మహబూబ్‌నగర్‌ జిల్లాలో7 వార్డుల్లో నామినేషన్‌ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

దాఖలైన మొత్తం నామినేషన్ల పరిశీలన అనంతరం 4,147 సర్పంచ్‌ స్థానాలకు 27,277 మంది, 36,332 వార్డు సభ్యుల స్థానాలకు 89,603 మంది బరిలో నిలిచినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. తిరస్కర ణకు గురైన సర్పంచ్‌, వార్డు సభ్యుల నామినేషన్లపై నేడు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. సోమవారం అప్పిళ్లపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితా ను ప్రకటించి ఆల్ఫాబేటికల్‌ వారీగా ఎన్నికల గుర్తుల ను కేటాయిస్తారు. సర్పంచ్‌ కోసం ఒక్కో స్థానానికి 6.5 చొప్పున, వార్డులకు ఒక్కో స్తానానికి 3.29 చొప్పున సగటున నామినేషన్లు దాఖలయ్యాయి.

16 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా
రాష్ట్రంలోని మొత్తం 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. మొదటి దశలో 5, చివరి దశలో 11 గ్రామాలు మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. అలాగే మొదటి దశలో 149, మూడో దశలో 100 వార్డులు మొత్తం 249 వార్డుల్లో ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదు. ప్రతి దశలో నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడు రోజుల గడువిచ్చానా ఎవరూ పోటీకి ముందుకు రాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. రోస్టర్‌ విధానంలో రిజర్వేషన్ల కేటాయింపుతో కొన్ని చోట్ల అభ్యర్థులు లేక పోవడం, స్థానిక సమస్యలు తీర్చాలనీ, తమ గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారని తదితర కారణాలతో ఆయా గ్రామాలు ఎన్నికలు దూరంగా ఉన్నట్టు సమాచారం. కాగా సర్పంచ్‌, వార్డుల్లోనూ నామినేషన్లు అత్యధికంగా ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలోనే దాఖలు కాకపోవడం గమనార్హం. మూడో దశలో ఎన్నికలు జరగనున్న 4,333 పంచాయతీలు, 38,358 వార్డుల్లో నామినేషన్లు దాఖలయయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -