Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచులుగా 114 మంది పోటీ 

సర్పంచులుగా 114 మంది పోటీ 

- Advertisement -

రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం: ఎంపీడీవో వేదవతి 
నవతెలంగాణ-పాలకుర్తి

మండలంలో 38 గ్రామ పంచాయతీలల్లో రెండు గ్రామపంచాయతీలు సర్పంచులతో సహా వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయని, 36 గ్రామపంచాయతీలకు 114 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని ఎంపీడీవో వర్కల వేదవతి తెలిపారు. బుధవారం ఎంపీడీవో మాట్లాడుతూ తెలంగాణలో రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పాలకుర్తి మండలంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈనెల మూడు నుండి ప్రారంభమైన ఎన్నికల నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమాల సందర్భంగా 38 గ్రామపంచాయతీలకు 243 మంది సర్పంచులుగా నామినేషన్ దాఖలు చేశారని, 326 వార్డులకు 862 మంది నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. రెండు గ్రామపంచాయతీలతోపాటు 41 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని అన్నారు. 38 గ్రామపంచాయతీలకు 129 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ నుండి ఉపసంహరించుకున్నారని, రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు. 326 వార్డుల్లో 41 వార్డులు ఏకగ్రీవం కాగా 285 వార్డులకు 702 మంది బరిలో ఉన్నారని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -