లక్షలాది మంది నిరాశ్రయులపై బాంబుల వర్షం
గాజా : గాజాపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులు, కాల్పుల్లో 118 మంది మరణించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న 38 మంది ఉన్నారని వెల్లడించింది. పాలస్తీనియన్లకు ఆహారం అందించేందుకు ఇజ్రాయిల్ మద్దతుతో కొత్తగా ప్రారంభమైన అమెరికా సంస్థ అయిన గాజా హ్యూమన్‌టేరియన్ ఫౌండేషన్ వెలుపల సాయం కోసం వేచివున్న ఐదుగురు మరణించగా, గాజాస్ట్రిప్‌లోని ఇతర ప్రదేశాలలో సహాయ ట్రక్కుల వెలుపల సాయం కోసం చూస్తున్న 33 మంది మరణించారని ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. నిరాశ్రయులైన పలువురు పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారని. దానిపై కూడా దాడి జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి. ఇజ్రాయిల్ దాడులు గాజాను శిథిలావస్థకు చేర్చాయి. అధికభాగం నేలమట్టమైంది. గాజాలోని 2.3 మిలియన్ల జనాభాలో 90శాతం కంటే ఎక్కువమంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం గాజాలో మానవ సంక్షోభానికి కూడా దారితీసింది. లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు.
ఇజ్రాయిల్ దాడుల్లో 118 మంది పాలస్తీనియన్లు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES