Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంఆయుధాలతో సహా 12 మంది మావోయిస్టులు సరెండర్

ఆయుధాలతో సహా 12 మంది మావోయిస్టులు సరెండర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ఉధృతంగా కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని దండకారణ్యాలను జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక డ్రోన్లు, అదనపు బలగాల సాయంతో ఇటీవల వరుసగా ఎన్‌కౌంటర్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల పునరావాసం, జన జీవన స్రవంతిలోకి వచ్చి పోరాటం చేస్తామనే ఆలోచనతో అగ్రనేతలు లొంగబాట్లు మావోయిస్టు పార్టీని బలహీనం చేశాయి.

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ జిల్లా బకర్‌కట్టా థానా పరిధిలోని కుమ్హీ గ్రామంలో కీలక పరిణామం చోటచేసుకుంది. సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది ఆయుధానలతో సహా ఛత్తీస్‌గఢ్ పోలీసులు, భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. వారిలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ రామ్‌ధేర్ మజ్జీ, డివిజన్ కమిటీ సభ్యులు చందు ఉసేండి, లలిత, జానకీ, ప్రేమ్, ఏరియా కమిటీ సభ్యులు రామ్‌సింగ్ దాదా, సుకేశ్ పొట్టం, ప్లటూన్ పార్టీ మెంబర్లు లక్ష్మి, శీలా, సాగర్, కవత, యోగిత ఉన్నారు. ఈ మేరకు వారి నుంచి 03 AK 47 గన్స్, 03 ఇన్సాస్‌ గన్స్, 02 ఎస్ఎల్‌ఆర్ గన్స్, 02 303 రైఫిళ్లు, కార్బైడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులలో కొందరిపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -