నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు భాషా, సాహిత్యం, కళలు తదితర రంగా లలో విశేషమైన కృషిచేసిన 12 మంది ప్రముఖులకు 2024 ఏడాదికి గాను సుర వరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. డాక్టర్ యాకూబ్ (కవిత), డాక్టర్ ఎం.ఏ. శ్రీనివాసన్ (పరిశోధన), ఎల్.నరేం దర్(చిత్రలేఖనం), బైరోజు చంద్రశేఖర్ (శిల్పం), ఆర్.ప్రసన్నరాణి (నృత్యం), డాక్టర్. బీ రాధ సారంగపాణి (సంగీతం), కే
కైలాస్ (పత్రికారంగం), దుపెల్లి శ్రీరాములు (నాటకం), గజ్వేల్లి సమ్మయ్య (జానపద కళా రంగం), ఆముదాల మురళి (అవధానం), డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి (ఉత్తమ రచ యిత్రి), పోల్కంపల్లి శాంతాదేవి (నవల/కథ) పురస్కారాలకు ఎంపికైనట్లు తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంత రావు వెల్లడించారు. జూలై 19న జరగనున్న కార్యక్రమంలో పురస్కారంగా ఒక్కొక్కరికీ రూ.20,116 నగదు, శాలువాతో సత్కరిస్తామని ఆయన తెలిపారు.
12మందికి తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES