– సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్న యూనియన్
– యూనియన్ లో చేరిన కార్మికులు
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ )లో మంగళవారం కామారెడ్డి మున్సిపల్ లో వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న వాటర్ మెన్స్ ఎలక్ట్రిషన్స్ , సంపుల వద్ద పనిచేసే లీకేజ్ గ్రూప్, మోటార్ టీం అందరు కలిసి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుందారపు రాజనర్సు ఆధ్వర్యంలో 140 మంది చేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ .. వాటర్ సప్లై కమిటీ వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కమిటీలో చేరిన వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల హక్కులు కోసం నిరంతరం సిఐటియు పనిచేస్తుందని అందువల్ల వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంఘంలో తాము చేరమన్నారు.
నూతన కార్యవర్గం ఏర్పాటు.
ఈ కమిటీకి గౌరవాధ్యక్షులుగా చంద్రశేఖర్, అధ్యక్షుడిగా అయాజ్, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కందరపు రాజనర్సు. ఉపాధ్యక్షులుగా కాట్రియాల ప్రభు, వై రాజు, కే సాయి, భూలక్ష్మి, కోశాధికారిగా నాగరాజు, సహాయ కార్యదర్శి ముధం కృష్ణ, నర్సింలు, ఆర్గనైజేషన్ సెక్రటరీలుగా అజయ్, అబ్బాస్, సలహాదారులు అన్నపల్లి శ్రీనివాస్, ఖలీముద్దీన్, ఇస్మాయిల్, మహేష్, ధర్మసేన, రవీందర్, శంకర్, కార్యవర్గ సభ్యులు భాస్కర్, మహమూద్, ఎల్లవ్వ, సుజాత, సంజీవ్, నవీన్, చరణ్, సంగారెడ్డి, కే లింగం, బాల్ నర్సు, రాములు ఇకనుండి కార్మికుల హక్కుల కోసం పని చేయాలనీ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రంలో మున్సిపల్ కార్మికుల జిల్లా కార్యదర్శి ఎండి మహిబబు అలీ తదితరులు పాల్గొన్నారు.



