Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeసినిమావైభవంగా 15 చిత్రాలు ప్రారంభం

వైభవంగా 15 చిత్రాలు ప్రారంభం

- Advertisement -

భీమవరం టాకీస్‌ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మాత టి. రామసత్యనారాయణ నిర్మించారు.
ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో భారీ సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథమహారథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మురళీమోహన్‌, రేలంగి నరసింహా రావు, సుమన్‌, శ్రీకాంత్‌, జె.డి. చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్‌ పథ్వి, అజరు ఘోష్‌, సి.కళ్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్‌, చదలవాడ శ్రీనివాసరావు, భరత్‌ భూషణ్‌, వల్లూరిపల్లి రమేష్‌ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌, రచయిత, విజయేంద్రప్రసాద్‌, కె.ఎల్‌.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్‌, గజల్‌ శ్రీనివాస్‌, చీకటి ప్రవీణ్‌, ఇమ్మడి రమేష్‌, వంశీ రామరాజు, కె.ధర్మారావు, గిడుగు కాంతి కష్ణ తదితరులు హాజరై, నిర్మాత రామసత్యనారాయణను అభినందించారు.
జస్టిస్‌ ధర్మ (యండమూరి వీరేంద్రనాథ్‌), నాగపంచమి (ఓం సాయిప్రకాష్‌), నా పేరు పవన్‌ కల్యాణ్‌ (జె.కె.భారవి),
టాపర్‌ (ఉదరు భాస్కర్‌), కె.పి.హెచ్‌.బి. కాలని (తల్లాడ సాయికష్ణ), పోలీస్‌ సింహం (సంగకుమార్‌), అవంతిక- 2,
(శ్రీరాజ్‌ బళ్ళా), యండమూరి కథలు (రవి బసర), బి.సి.-(బ్లాక్‌ కమాండో) (మోహన్‌ కాంత్‌), హనీ కిడ్స్‌ (హర్ష), సావాసం (ఏకరి సత్యనారాయణ), డార్క్‌ స్టోరీస్‌ (కష్ణ కార్తీక్‌), మనల్ని ఎవడ్రా ఆపేది (బి.శ్రీనివాసరావు), ది ఫైనల్‌ కాల్‌
(ప్రణరు రాజ్‌ వంగరి), అవతారం (డా: సతీష్‌).. ఈ 15 చిత్రాలకు 15 కెమెరాలతో క్లాప్‌, స్విచ్ఛాన్‌, గౌరవ దర్శకత్వం చేయించడం విశేషం. ఈ 15 చిత్రాలకు వచ్చే ఏడాది ఆగస్టు 15కి పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రామసత్యనారాయణ పేర్కొన్నారు. ఈ 15 చిత్రాలకు కెఎల్‌ స్టూడియోను 25% డిస్కౌంట్‌తో ఇస్తున్నందుకు కొంతం లక్ష్మణ్‌కు ఆయన కతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్‌ రికార్డ్‌ బుక్స్‌లో నమోదు చేశాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad