తెలంగాణ భవిష్యత్ కోసం ఆర్థిక సమ్మిట్
8న ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈనెల 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌కు ఆరు ఖండాలు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తున్నారని మల్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇది పూర్తిగా ఆర్థిక సమ్మిట్ అని పేర్కొన్నారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిటి ఆయోగ్, ఐఎస్‌బీ సూచనలు, సలహాలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వివరించారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గ్లోబల్ సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభిస్తారని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
మొదటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వీడర్, కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్స న్ కిరణ్ మజుందార్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారని వివరించారు. శాఖల వారీగా చర్చలుంటాయని తెలిపారు. ఆయా శాఖల మంత్రులు, ముఖ్యకార్యదర్శులు పాల్గొంటారని పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారో తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలనూ ఆహ్వానించామని తెలిపారు. అతిథులు, ప్రముఖులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



