Saturday, November 15, 2025
E-PAPER
Homeక్రైమ్ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత

ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ-నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. చిన్నపిల్లల వార్డులో శిశువులకు ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే 17 మంది చిన్నారులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాధిత శిశువులను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక ఇంజక్షన్‌ బదులుగా మరొకటి ఇచ్చారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఘటనపై విచారణకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -