Wednesday, October 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునమిల సమీపంలో 18 మేకలు చోరీ..

నమిల సమీపంలో 18 మేకలు చోరీ..

- Advertisement -

నవతెలంగాణ – రాజపేట
రాజపేట మండలం నమిల గ్రామ పరిధిలోని పూలోని భాయి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి 18 మేకలు చోరీకి గురయ్యాయి. బుధవారం బాధిత రైతు పులి బాలరాజు, పులి చంద్రమౌళి లు వివరాలు తెలిపారు. మేకల దొడ్డిలోని 18 మేకలను ప్రత్యేక వాహనంలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బొందుగుల సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ లో పరిశీలించగా సుమారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రత్యేక వాహనంలో మేకలు తరలించినట్లు తెలుస్తుందని పులి చంద్రమౌళి చెప్పారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. సుమారు రూ.2 లక్షల 50వేల విలువైన మేకలు చోరీకి గురైనట్లు పులి చంద్రమౌళి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -