- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోని బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్‌ను పగులగొట్టి 18 తులాల బంగారం, వెండి ఆభరణాలు, లక్ష నగదు ఎత్తుకెళ్లారు. నవంబర్ 27వ తేదీన రాము కుటుంబం మామ దినకర్మల కోసం వేరే గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ దొంగతనం జరిగింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



