రాజస్తాన్‌లో ఘోరం.. మంటల్లో దగ్ధమైన బస్సు
జైపూర్ : రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జైసల్మేర్ నుంచి జోధ్‌పుర్ వైపు వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20మంది సజీవ దహనమయ్యారు.పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయా ణీకులు ఉన్నారు. జైసల్మేర్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రయివేటు బస్సు జోధ్‌పుర్‌కు
20 మంది సజీవ దహనం బయలుదేరింది. జైసల్మేర్‌లో బయలుదేరిన కొద్ది సేపటికే, అంటే దాదాపు 20 కిలోమీటర్లు దూరంలోని థాయత్ గ్రామ సమీపానికి చేరుకోగానే బస్సు వెనక భాగంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. దీంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్.. ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. మరోవైపు వెంటనే స్పందించిన స్థానికులు, ఇతర వాహనదారులు ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు బస్సులో మంట లను అర్పివేశాయి. అయినా బస్సు 80 శాతం వరకూ కాలిపో యింది. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా సహాయక చర్యలకు ఆలస్యమయింది. సాయంత్రం వరకూ మృతదేహాలు బస్సులో ఉన్నాయి. క్షతగాత్రులను జైసల్మేర్‌లోని జవహర్ ఆస్పత్రికి తరలించారు. తరువాత వారిని జోధ్‌పుర్‌కు రిఫర్ చేశారు.
20 మంది సజీవ దహనం
- Advertisement -
- Advertisement -