Thursday, July 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభార‌త్‌పై 25 శాతం సుంకం: ట‌్రంప్

భార‌త్‌పై 25 శాతం సుంకం: ట‌్రంప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆగ‌ష్టు 1తో ట్రంప్ సుంకాల డెడ్ లైన్ గ‌డువు ముగియ‌నుంది. ఈక్ర‌మంలో యూఎస్ ప్రెసిడెంట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాల మధ్య చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో దీని గురించి సమాచారం ఇచ్చారు.

“భారత్ మా మిత్రదేశం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌ అమెరికా వస్తువులపై ఎక్కువ సుంకాలు విధిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధిస్తున్నారు. దీంతో భారత్‌లో అమెరికా వాణిజ్యం తగ్గుతోంది. భారత్ రష్యా నుంచి సైనిక పరికరాలను కొనుగోలు చేస్తోంది. ఇది సరైన నిర్ణయం కాదు. అందరూ రష్యా ఉక్రెయిన్‌పై దాడి ఆపాలని కోరుకుంటున్నారు. కానీ భారతదేశం రష్యాతో వాణిజ్యాన్ని పెంచుతోంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, అమెరికా భారతదేశంపై 25 శాతం సుంకం విధించాలని నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.” అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారతదేశ ఎగుమతులు 22.8 శాతం పెరిగి 25.51 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనించదగ్గ విషయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -