Thursday, July 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌పై 25 శాతం సుంకాలు..

భారత్‌పై 25 శాతం సుంకాలు..

- Advertisement -

ఆగస్టు 1 నుంచి అమల్లోకి..
రష్యా నుంచి చమురు దిగుమతులపై పెనాల్టీలు కూడా..
ఉక్రెయిన్‌పై దాడులను భారత్‌ ఖండించలేదు : ట్రంప్‌
ఎడిన్‌బర్గ్‌:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై చర్యలకు ఉపక్రమించారు. మన దేశ వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్‌ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు. ”భారత్‌ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్‌, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుం టున్నాయి. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి” అని ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా ప్రకటించారు. ఇటీవల భారత్‌ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్‌.. ఆగస్టు 1ని డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి ఏప్రిల్‌లోనే ప్రకటన చేసినప్పటికీ.. చర్చల కోసం వీటి అమలుకు గడువు ఇచ్చారు. ఇక భారత్‌పై సుంకాల విషయంలో ఇటీవల స్కాట్లాండ్‌ పర్యటన సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారత్‌ సుంకాలు విధిస్తోందని, అలా చేయడం తగదన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందా న్ని ఖరారు చేయడానికి మరికొన్ని చర్చలు అవసరమని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్‌ గ్రీర్‌ పేర్కొన్నారు. అమెరికా విధించిన ఆగస్టు 1 గడువు సమీపిస్తున్న తరుణంలో గ్రీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఇటీవలే ఐదు రౌండ్ల చర్చలను పూర్తి చేసింది. ”మేం భారతీయ అధికారులతో మాట్లాడు తూనే ఉన్నాం. చాలా సానుకూల చర్చలు జరిగాయి. భారత్‌ తమ మార్కెట్‌లో కొ న్ని భాగాలను తెరవడానికి ఆసక్తిని వ్యక్తం చేసిందన్నారు.” అని గ్రీర్‌ పేర్కొన్నారు.
దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం ట్రంప్‌ సుంకాల ప్రకటనపై భారత్‌
న్యూఢిల్లీ: భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనపై.. భారత్‌ స్పందించింది. ట్రంప్‌ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేదానిపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. ఈ వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -