Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఆటలు260 డోపింగ్‌ కేసులు

260 డోపింగ్‌ కేసులు

- Advertisement -

– 2014లో భారత్‌ అథ్లెట్ల చెత్త రికార్డు
న్యూఢిల్లీ :
స్పోర్ట్స్‌లో సూపర్‌ పవర్‌గా ఎదిగేందుకు చూస్తున్న భారత్‌.. డోపింగ్‌ భూతాన్ని తరిమికొట్టడంలో దారుణంగా విఫలమవుతోంది. ఇటీవల వరుసగా రెండేండ్లుగా భారత్‌లో రికార్డు డోపింగ్‌ కేసులు నమోదు కావటం కలవరపాటుకు గురి చేస్తోంది. పార్లమెంట్‌ చర్చలో భాగంగా ఓ రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు క్రీడామంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. 2014లో భారత్‌లో 260 డోపింగ్‌ కేసులు వెలుగుచూసినట్టు సభకు తెలిపింది. 2014లో 7466 శాంపిల్స్‌ పరీక్ష చేయగా.. అందులో 260 శాంపిల్స్‌ పాజిటివ్‌గా తేలాయి. 2023లో భారత్‌లో 224 పాజిటివ్‌ కేసులు వచ్చినట్టు ఇటీవల వాడా (వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ) నివేదికలో వెల్లడైన సంగతి తెలిసిందే. అథ్లెటిక్స్‌లో 76, వెయిట్‌లిఫ్టింగ్‌లో 43, రెజ్లింగ్‌లో 29, బాక్సింగ్‌లో 17 డోపింగ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. క్రీడల్లో డోపింగ్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి మాండవీయ అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img