Monday, August 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌లో భారీ వ‌ర‌ద‌లకు 299మంది మృతి

పాకిస్థాన్‌లో భారీ వ‌ర‌ద‌లకు 299మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జూన్ చివరి నుండి పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో కురుస్తున్న‌ కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల ధాటికి ఇప్ప‌టికి 299మంది చ‌నిపోగా..అందులో 140మంది చిన్నారులే అధికంగా మృత్య‌వాత ప‌డ్డార‌ని ఆ దేశ ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మ‌రో 700 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని తెలిపారు. మృతుల్లో 102మంది పురుషులు, 57 మంది మ‌హిళ‌లు ఉన్నారు.

మ‌రో వైపు భారీ వ‌ర‌ద‌ల ధాటికి ఆ దేశంలోని ప‌లు ప్రాంతాలు నీటిమునిగాయి. అంతేకాకుండా ప‌లు జ‌నావాసాలు వ‌ర‌ద‌ల ధాటికి కొట్టుకుపోయాయి. తీవ్ర వాతావరణం కారణంగా 1,676 ఇళ్ళు దెబ్బతిన్నాయి – వాటిలో 562 పూర్తిగా ధ్వంసంకాగా.. 1,114 పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరదల్లో 428మూడ జీవాలు మ‌ర‌ణించాయి. అకాల వ‌ర‌ద‌ల‌తో పలు ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించి పోయింది.

వ‌ర‌ద బాధితుల‌ను కాపాడానికి ఆ దేశ విప‌త్తు ద‌ళాలు నిర్విరామంగా కృషి చేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుండి 2,880 మందిని సుర‌క్షిత ప్రాంతాలకు త‌ర‌లించింది.. సహాయక చర్యలలో 2,000 టెంట్లు, 958 దుప్పట్లు, 569 దుప్పట్లు, 613 పరుపులు, 1,100 కి పైగా ఆహార ప్యాక్‌లతో సహా 13,400 కి పైగా ముఖ్యమైన వస్తువులను బాధితుల‌కు పంపిణీ చేసిన‌ట్టు ఆదేశ అధికారిక డాన్ మీడియా వెల్ల‌డించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -