Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో 2కె రన్ విజయవంతం..

మద్నూర్ లో 2కె రన్ విజయవంతం..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్ విజయవంతమైంది. శుక్రవారం ఎస్సై విజయ్ కొండా ఆధ్వర్యంలో మద్నూర్ పోలీస్ స్టేషన్ నుండి మండలంలోని రాష్ట్ర సరిహద్దు సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2కే రన్ కార్యక్రమంలో ఎస్సై విజయ్ కొండ డిప్యూటీ తాసిల్దార్ శివరామకృష్ణ గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ అగ్నిమాపక సిబ్బంది మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పోలీసులు వివిధ పాఠశాలల విద్యార్థులు వీరితో పాటు యువ నాయకులు కృష్ణ పటేల్ అజయ్ గడ్డం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా టూకే రన్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పోలీస్ శాఖ బహుమతులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -