లాపరోటమీ విత్ కోలాస్టమి(స్టోమా) విజయవంతం
శస్త్ర చికిత్స వివరాలు వెల్లడించిన వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు ..
నవతెలంగాణ – కంఠేశ్వర్
మూడు రోజుల బాబుకు వెల్నెస్ ఆస్పత్రిలో అరుదైన కోలస్టమి లాపరోటమీ శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ వివరించారు. ఈ మేరకు బుధవారం నగరంలోని వెల్నెస్ ఆస్పత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్నెస్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కు చెందిన గంగా ప్రవళిక జులై 25 వ తేదీ డెలివరీ అయి జులై 28వ తేదీ వెల్నెస్ ఆస్పత్రికి తమ బాబుకు పుట్టినప్పటి నుండి మోషన్ రాకపోవడం తో వచ్చారన్నారు. ఆస్పత్రిలో బాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాక “ఇంత స్ట్రైనల్ అబ్స్ట్రక్షన్” చిన్న పేగులో దూరడంతో కడుపులో నొప్పితో పాటు యూరిన్, స్టోల్ సమస్య ఏర్పడుతుందన్నారు.
లాపరోటమీ అనేది ఉదర అవయవాలను యాక్సెస్ చేయడానికి ఉదరంలోకి కోత పెట్టడం, అయితే కొలోస్టమీ అనేది మలం బయటకు వెళ్లడానికి పెద్దప్రేగులో ఓపెనింగ్ (స్టోమా)ను సృష్టించే శస్త్రచికిత్సా విధానం . లాపరోటమీ అనేది ఒక సాధారణ శస్త్రచికిత్సా విధానం, అయితే కొలోస్టమీ అనేది ఒక నిర్దిష్ట రకమైన స్టోమా శస్త్రచికిత్స విజయవంతంగా వెళ్లాస్ ఆసుపత్రి వైద్య బృందంతో నిర్వహించినట్లు తెలిపారు. 29వ తేదీ ఉదయం ఆపరేషన్ జరిగిన సమయం నుండి 24 గంటల అబ్జర్వేషన్లో పెట్టీ, అందులో ఒక గంట వెంటిలేటర్ పై అన్ని రకాల చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. వెల్నెస్ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ మాట్లాడుతూ.. జులై 28వ తేదీన బేబీ ఆఫ్ గంగా ప్రవళిక వాళ్లకి చాలా త్వరగా తమ వైద్యులు వాళ్లకు సరైన టైంలో రెస్పాండ్ అయ్యి సర్జరీ చేయడం జరిగింది.
ఎమర్జెన్సీ సర్జరీ చాలా తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో మేము వైద్యం అందించే లక్ష్యంగానే నిజాంబాద్లో వెల్నెస్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఎవ్వరైనా సరే నిజాంబాద్ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వెన్నెల ఆస్పత్రిలో సేవలను వినియోగించుకోవాలని కోరారు. తమ హాస్పిటల్ డాక్టర్స్ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటారన్నారు. ఒకవేళ రాత్రి సమయంలో వచ్చిన వైద్యం అందించడానికి ముందుంటామని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాదులోనే వైద్యం అందించేందుకు వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. అదేవిధంగా బాబు తల్లి గంగా ప్రవళిక విలేకరులతో మాట్లాడుతూ… పసరు వామిటింగ్ కంటిన్యూగా చేస్తూ, పుట్టినా నుండి మోషన్ రావడంలేదని సరైన సమయంలో వెళ్లి ఆసుపత్రికి రావడం జరిగిందని తక్షణమే స్పందించిన వైద్యులు తమ బాబుకు చికిత్స అందించి కాపాడారాని ఆస్పత్రి వైద్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాదులోనే వెళ్లిన శాసుపత్రిలో తక్కువ ఖర్చుతో తమ బాబును కాపాడి అప్పగించారని సంతోషించారు.
ఆపరేషన్ హెడ్ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ చుట్టుపక్కల చాలామంది పేద ప్రజలు ఉంటారని వారి కోసం నిజామాబాద్ లో తక్కువ ఖర్చులతో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అనస్తేషియా వైద్యురాలు శృతి శైని, బేబీ ఆఫ్ గంగ ప్రవళిక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.