Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జంగిడిపల్లి రోడ్డులో 3.కిలోల గంజాయి పట్టివేత..!

జంగిడిపల్లి రోడ్డులో 3.కిలోల గంజాయి పట్టివేత..!

- Advertisement -
  • – కాటారం డిఎస్పీ సూర్యనారాయణ
  • నవతెలంగాణ-మల్హర్ రావు: మండలంలోని ఎడ్లపల్లి గ్రామపచాయితీ పరిదిలోగల జంగిడిపల్లి రోడ్డు క్రాస్ వద్ద 3.335 కిలోల గంజాయి పట్టుకున్నట్టుకుగా కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, కాటారం సిఐ నాగార్జున రావు తెలిపారు.వారి పూర్తి కథనం ప్రకారం ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు కొయ్యుర్, కాటారం, రుద్రారం ప్రధాన రహదారులపై కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్,ఎస్ఐ-రాజన్ శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టునట్లుగా తెలిపారు. ఈ తనిఖీల్లో జంగిడిపల్లి క్రాస్ రోడ్డులో 3.335 కిలోల గంజాయ్, నలుగురు యువకులు, టివిఎస్ అపాచి, బజాజ్ పల్సర్ రెండు ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.
  • అయితే శనివారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డిఎస్పీ పూర్తి వివరాలను వెల్లడించారు.ప్రభుత్వ నిషేధిత గంజాయ్ అక్రమంగా తరలిస్తున్న నిందితులను పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. అందులో ఏ1గా జంజర్ల రోహిత్ (22) హనుమాన్ నగర్ 8వ కాలనీ, ఏ2గా జంజర్ల బాలాజీ (23) హనుమాన్ నగర్ 8వ కాలనీ,ఏ3గా కట్కూరు రిత్విక్ (20)  హనుమాన్ నగర్ 8వ కాలనీ, ఏ4గా బుజ్జి పేటల్ గ్రామం, కలిమెల మండలం, మల్కన్ గిరి జిల్లా, ఒడిసా రాష్ట్రం అని వివరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా డిఎస్పీ సూచించారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad