- Advertisement -
– బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. కేవలం రూ.1కే 30 రోజుల అపరిమిత సేవలను అందిస్తున్నట్టు తెలిపింది. ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్’ పేరుతో అందిస్తున్న ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు వర్తిస్తుందని వెల్లడించింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 2జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్ కోసం సమీపంలోని బీఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్ సంప్రదించాలని సూచించింది.
- Advertisement -