ముంబై: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్ అయిన ఐపీఎల్ 19వ సీజన్ (2026)కు సంబంధించిన ఆటగాళ్ల వేలం అబుదాబిలో ఈ నెల16న జరగనుంది. ఈ వేలంలో మొత్తం 350 మంది క్రికెటర్లు తమ అద ష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో 240 మంది భారత ఆటగాళ్లు కాగా, మిగిలిన 110 మంది విదేశీయులు ఉన్నారు. వేలం కోసం మొత్తంగా 1,390 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా, తుది జాబితాలో 350 మందిని మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ 350 మంది ఆటగాళ్లు పది జట్లలో ఉన్న 77 ఖాళీల కోసం పోటీపడనున్నారు., ఇటీవలే వన్డేల నుంచి రిటైర్మెంట్‌ను వెనక్కుతీసుకున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ రూ. 1 కోటి కనీస ధరతో చివరి నిమిషంలో ఈ జాబితాలో చేరడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ , ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వేరూ. 2 కోట్ల కనీస ధరతో బరిలో ఉన్నారు. భారత జట్టుకు దూరమైన ఆటగాళ్లు ప థ్వీ షా, సరారాేజ్ ఖాన్ (రూ. 75 లక్షలు) ఐపీఎల్ వేలంలో బరిలో నిలిచారు. దేశవాళీ ఆటగాళ్లలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సత్తా చాటిన కునాల్ చందేల, అశోక్ కుమార్ వంటి వారు కూడా తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 64.3 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 43.4 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 25.5 కోట్లు) ఉన్నాయి. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఉంది. ఇందులో ఇంగ్లండ్ నుంచి 21 మంది, ఆస్ట్రేలియా నుంచి 19 మంది , న్యూజిలాండ్ నుంచి 16 మంది, దక్షిణాఫ్రికా నుంచి 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. వెస్టిండీస్ నుంచి అల్జారీ జోసెఫ్, శ్రీలంక నుంచి వానిందు హసరంగా వంటి ప్రముఖులు కూడా వేలంలో కీలక ఆటగాళ్లుగా నిలవనున్నారు.



