- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నాటుసారా తయారీ కోసం ఉపయోగించే బెల్లంను నల్లగొండ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం సభ్యులు పట్టుకున్నారు. అక్రమంగా లారీలో 1167 బస్తాల్లో 35,010 కిలోల బెల్లాన్ని సూర్యపేట జిల్లా మోతే మండలానికి తరలిస్తుండగా సింగరేణిపల్లి చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. లారీలోని 1167 సంచుల్లో బెల్లం ఉంది. ప్రతి బ్యాగులో 30 కేజీలు ఉందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. దీని విలువ రూ.35 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎక్సైజ్ పోలీసులు వివరించారు.
- Advertisement -



