Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా వ్యాప్తంగా 36182 కేసులు పరిష్కరం

జిల్లా వ్యాప్తంగా 36182 కేసులు పరిష్కరం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులో 8 బేంచీలు ఏర్పాటు చేసినట్లు ఇందులో  మొత్తం 36182 కేసులు  పరిష్కరించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు, తెలిపారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌  ను భువనగిరిలోని జిల్లా కోర్టు ప్రాంగణములో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ కార్యాక్రమములో వైవాహిక వివాదాన్ని సామరస్యంతో పరిష్కరించుకొని ఒక్కటైన దంపతులను, రూ. 22 కోట్ల కు సంబందించిన భూమి కొనుగోలు వివాదాన్ని ఇరు పక్షాలు లోక్‌ అదాలత్‌ సామరస్యపూరితంగా పరిష్కరించుకున్నౌదుకు ఇరువర్గాలను, న్యాయవాదులను  అభినందించారు.

కోర్టు ఆవరణలో హెల్ప్‌ డెస్క్‌ లను ఏర్పాటుచేసి తమ కేసులను పరిష్కరించుకోవటానికి వచ్చిన  కక్షిదారులకు  తగిన సూచనలు, సలహాలు ఇవ్వటానికి న్యాయ సహాయ న్యాయవాదులను, సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  లోక్‌ అదాలత్‌ ద్వారా చిన్న తగాదాలను రాజీ చేసుకొని స్నేహపూర్వక వాతావరణములో ఉండటమే కాకుండా , సివిల్‌ కేసులను  పరిష్కరించుకొని తమ కుటుంబ శ్రేయస్సుకు , ఆర్ధిక ప్రగతికి తోడ్పడాలన్నారు. రాజీయే రాజ మార్గమన్నారు. జిల్లా మొత్తంగా 8 లోక్‌ అదాలత్‌ బెంచీలలో 2500 క్రిమినల్‌ కేసులు, 14 సివిల్‌ కేసులు, ప్రి లిటిగేషన్‌ కేసులు టెలిఫోన్‌ ఋణ బకాయల కేసులు, ఎస్‌.బి.ఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ చెందిన 76  కేసులను, ట్రాఫిక్‌ చలాన కేసులు 33592 మొత్తం 36182 పరిష్కరించబడ్డాయి. 

ఈ కార్యాక్రమములో కార్యదర్శి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వి. మాధవిలత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా,  అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎన్‌. శ్యామ్‌ సుందర్, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ జి.స్వాతి, ప్రభుత్వ న్యాయవాదులు, ఎ పి పి ఒలు సౌజన్య, చంద్రశేఖర్, లోక్‌ అదాలత్‌ సభ్యులు పిడుగు ఐలయ్య , ఇరానీ కిష్టయ్య, బొద్దు కిషన్, న్యాయ సహాయ న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసు యంత్రాంగం, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -