Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూభారతి సర్వేలో 364 దరఖాస్తులు

భూభారతి సర్వేలో 364 దరఖాస్తులు

- Advertisement -

ఇన్చార్జి తహసిల్దార్ హేమలత..
నవతెలంగాణ –  జుక్కల్ 
: జుక్కల్ మండలంలో భూభారతి సర్వేలో జూలై 20వ తేదీన ముగిశాయి. మండలంలో 30 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాలలో డిప్యూటీ తహసిల్దార్ హేమలత ఒక బృందంగా , ఆర్ ఐ రామ్ పార్టీ ఆధ్వర్యంలో మరొక బృందంగా ఏర్పాటు చేసి , రోజుకు నాలుగు గ్రామాల చొప్పున రెండు బృందాలు వివిధ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. మండలంలోని గ్రామాలలోని  రైతులు భూ సమస్యలు ఉన్నవారు 364 దరఖాస్తులను అధికారులకు మండల వ్యాప్తంగా అందజేయడం జరిగింది. భూభారతి రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు , సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ నాగనాథ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. జూన్ మూడవ తేదీ నుండి ప్రారంభమైన జులై 30వ తేదీ వరకు కొనసాగాయి. భూభారతి రెవెన్యూ సదస్సులు జుక్కల్ మండలంలో విజయవంతంగా కొనసాగినాయని రెవెన్యూ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -