ఎస్‌ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘వర్ణమాల..’ సాంగ్‌ని లాంచ్ చేశారు. హీరో దుశ్యంత్ మాట్లాడుతూ,’డైరెక్టర్ సునితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కన్నడలో చాలా విజయవంతమైన సినిమాలు అందించారు. ఇదొక అద్భుతమైన స్క్రిప్టు. హిస్టరీ, మైథాలజీ, సనాతన ధర్మ ఎలిమెంట్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. తెలుగు, కన్నడ రెండిట్లోనూ చిత్రీకరణ చేసాం. ఆశిక రంగనాథన్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసింది’ అని తెలిపారు.
‘ఇప్పటివరకు నేను చేసిన రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ కన్నడ సినిమా తెలుగులోకి వస్తోంది. అది ఈ సినిమా కావడం చాలా స్పెషల్ ఫీలింగ్. నేను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి’ అని హీరోయిన్ అశిక చెప్పారు. డైరెక్టర్ సునీ మాట్లాడుతూ, ‘అద్భుతమైన ఫాంటసీ మైథ¸లాజికల్ మూవీ. నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్‌లో చూస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాము. కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను’ అని ప్రొడ్యూసర్ దీపక్ చెప్పారు. ”వర్ణమాల’ పాట చాలా అద్భుతంగా వచ్చింది. చాలా ఆసక్తికరమైన సినిమా ఇది. మంచి సినిమాని సెలెబ్రేట్ చేయడం మన తెలుగు ప్రేక్షకులకు అలవాటు. అదే ప్రేమ ఈ సినిమాకీ కూడా ఇస్తారని భావిస్తున్నాను’ అని సింగర్ అనురాగ్ కులకర్ణి తెలిపారు.
4 భిన్న కథలు..
- Advertisement -
- Advertisement -