వైద్య బృందాన్ని అభినందించిన మెడికల్ సూపరింటెండెంట్
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ దవాఖానాలో ఓ గర్భిణి సాధారణ ప్రసవం ద్వారా నాలుగు కిలోల మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే మొదటి కాన్పుకు సర్జరీ అయ్యి, రెండో కాన్పుకు నార్మల్ డెలివరీ ద్వారా ఇంత బరువు గల శిశువు జన్మించడం ఆస్పత్రిలో ఇదే తొలిసారి అని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్‌బాబు తెలిపారు. నల్లకుంట అచ్చయ్యనగర్ ప్రాంతానికి చెందిన బి.దుర్గభవానికి పురిటి నొప్పులు రావడంతో భర్త నాగరాజు ఈనెల 3న కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడని చెప్పారు. వెంటనే గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ జ్యోతిర్మయి లేబర్ రూమ్‌కు గర్భిణిని తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. అదే రోజు ఉదయం 9 గంటల సమయంలో ఆమె సాధారణ ప్రసవం ద్వారా నాలుగు కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. శిశువు, తల్లి క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్‌ఓడీ డాక్టర్‌ను, డాక్టర్ సరిత, మెడ్ వైఫ్ సంతోషి, లేబర్ ఇన్‌చార్జి చంద్రలీల, స్టాఫ్ నర్స్ స్వప్నను సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్, ఆర్‌ఎంఓ డాక్టర్ సాధన అభినందించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో 4 కిలోల మగ శిశువు జననం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



