- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: వెనిజులాపై అమెరికా జరిపిన మెరుపుదాడుల్లో 40 మంది మరణించినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మృతుల్లో పౌరులు, సైనికులు ఉన్నట్టు సమాచారం. అమెరికా డెల్టా ఫోర్స్ జరిపిన ఈ ఆపరేషన్‌లో అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించారు. వీరి విమానం స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేరుకుంది. డ్రగ్స్, నార్కో-టెర్రరిజం ఆరోపణలపై బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో విచారణను ఎదుర్కోనున్నారు.
- Advertisement -



