- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్‌లో పూజారి శ్రీనివాస శర్మ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నవంబర్ 30న కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చారు. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో ఉన్న సుమారు 40 తులాల బంగారు నగలు, రూ.6 లక్షల నగదు చోరీకి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి విచారణ చేపట్టారు.
- Advertisement -


