Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం

- Advertisement -

– తెలంగాణలో కులగణన దేశానికే రోల్‌మోడల్‌
– స్థానిక సంస్థలు, ఉద్యోగాల్లో సముచిత స్థానం
– ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే : కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ ఎంపీ కంటెస్టెడ్‌ క్యాండిడేట్‌ నీలం మధు ముదిరాజ్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిది

”సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా బీసీ కులాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయం సాహసోపేతమైంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ పేరుతో ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు గడువులోపు కుల గణన చేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన ప్రక్రియ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుంది” అని కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ ఎంపీ కంటెస్టెడ్‌ క్యాండిడేట్‌ నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు గడిచినా దేశంలో 80 శాతం ఉన్న బీసీ, ఈ బీసీ కులాలకు రాజ్యాంగ ఫలాలు అందని ద్రాక్షలా మిగిలిపోయాయన్నారు. ఏ సామాజిక తరగతి జనాభా ఎంత ఉందో వారికి రాజకీయంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో అంతే శాతం అవకాశాలు దక్కాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమని తెలిపారు. ప్రజలకిచ్చిన మాట మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌ గాంధీ నాయకత్వం లో తెలంగాణలో చేపట్టిన కుల గణన దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కుల గణన ప్రక్రియను ప్రధాన మంత్రి మోడీ సైతం అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలు, ఉద్యోగ, విద్యా అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్దితో పని చేస్తుందని నీలం మధు అన్నారు. అందుకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదింపచేసి పార్లమెంట్‌కు పంపించినట్టు తెలిపారు. ఈ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో అమోదించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 5,6,7 తేదీల్లో ఢిల్లీ గడ్డపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోరుకు సిద్ధమయ్యామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అనుకూలంగా లేదన్నారు. ముస్లింల ముసుగులో రాష్ట్రంలోని వివిధ బీసీ కులాలకు తీరని అన్యాయం చేయాలని బీజేపీ చూస్తుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముస్లీంలకు కూడా బీసీ రిజర్వేషన్లు వర్తింపచేస్తున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లలో ముస్లీంలు కూడా ఉన్నారన్న విషయాన్ని బీజేపీ మంత్రులు మర్చి పోతున్నారన్నారు. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ మాత్రమే పాటుపడుతుందన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను కాంగ్రెస్‌ నెరవేర్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్‌ పార్టీనే తీసుకుం దన్నారు. రాహుల్‌ గాంధీ మార్గదర్శకంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -