Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత..

కశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కశ్మీర్ లోయలో ఉన్న మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్ట్ ప్రాంతాలను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది. ఇక మూసివేయబడిన టూరిస్ట్ ప్రాంతాల్లో త్వరలో సెక్యూరిటీని కల్పించనున్నారు. మరోవైపు సరిహద్దులో దాయది పాకిస్థాన్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నేడు తెల్లవారుజామున అక్నూర్ సెక్టార్‌ లో పాక్ రేంజర్లు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img