నవతెలంగాణ ఆర్మూర్
1) తీగజాతి( బీర, కాకర, దొండ, పొట్ల, సొర కాయ) కూరగాయల పెంపకం కోసం పందిరి సాగు చేయాలనుకునే రైతులకు 50% రాయితీ అందిస్తుందని ఉద్యాన శాఖ అధికారిని కె సంధ్యారాణి గురువారం తెలిపారు. ఒక్క రైతుకు కనీసం 0.50ఎకరా సాగు చేసుకోవచ్చు. అందుకు గాను శాఖా వారు 0.50ఎకరా గరిష్టంగా రూ.50 వేలు మించకుండా రాయితీ అందిస్తుంది.
2) టమోటో, వంగ, మిరప నారు కూడా ఉచితంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, జీడిమెట్ల ద్వారా అందిస్తున్నారు. ఒక ఎకరానికి 8000 మొక్కలు తీసుకోవచ్చు. ఒక్కో రైతు 2.50acres తీసుకోవచ్చు.
3)ఉద్యాన పంటలో వేసుకునే మల్చింగ్ కొరకు 50% (ఎకరానికి Rs.6400/-) రాయితీ అందిస్తుంది. ఒక్కో రైతు గరిష్టంగా 5.00ఎకరాలు తీసుకోవచ్చని తెలిపారు.
4) పండ్లు(మామిడి, జామ, సీతాఫలం, పపాయ, డ్రాగన్ ఫ్రూటీ)కూరగాయలు మరియు పూల తోట(బంతి, చామంతి, గల్లార్డియ మరియు ఇతర పూలు)సాగు ప్రోత్సహించడానికి శాఖా వారు 40% రాయితీ అందిస్తుంది. ఒక్కో రైతు గరిష్టంగా 5.00ఎకరాలు తీసుకోవచ్చు. ఆశక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యాన శాఖ తరపున కోరుతున్నామని, ఈ నెంబర్ (8977713980) కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.